టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో ఒకరైన కొరటాల శివ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రాన్ని కొరటాల శివ ప్రెసెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను విడుదల చేయగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పోస్టర్ లో సత్యదేవ్ లాంగ్ హెయిర్ స్టైల్, భారీ గడ్డంతో కనిపిస్తున్నాడు.