ప్రపంచ ధనవంతుడు జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈఓ పదవి నుండి ఈ రోజు తప్పుకోనున్నారు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ను బెజోస్ 27 ఏళ్ల క్రితం 1994 లో స్థాపించాడు. మొదట ఆన్లైన్ బుక్ స్టోర్ గా బెజోస్ దీనిని స్థాపించాడు. ఆ తరవాత అంచెలంచెలుగా ఎదిగి ఆన్లైన్ షాపింగ్ వరకూ చేరుకుంది. ఇక 1994 జూలై 5న బెజోస్ అమెజాన్ ను స్థాపించగా మళ్లీ 27 ఏళ్లకు అదే రోజు తన సీఈఓ పదవికి గుడ్ బై చెబుతున్నారు. అమెజాన్ సీఈఓ పదవి నుండి తప్పుకున్న అనంతరం బెజోస్ తన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ బాధ్యతలను స్వీకరించనున్నారు.