బీజేపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి శ్రీశైలం చుట్టు టెర్రరిస్టు సీపర్స్ సెల్స్ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీశైలం లో ఉన్న ప్రతి ఇంటిలోనూ సోదాలు చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల లో నెలకొన్న భయాందోళన తగ్గించడానికి డ్రోన్లను ఎవరు ఎందుకు ఎగరవేశారు అనేది త్వరగా తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.