నేడు బెంగళూరు నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాబోతున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీ వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎబీఎన్ అధినేత రాధాకృష్ణ, టీవీ 5 అధినేతను కలిసారు. కాగా ఇప్పుగు రామోజీరావు వద్దకు వెళ్లి ఆయనను కలవటం ఆసక్తి రేపుతోంది. రామోజీ రావు ను రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలవబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క లతో కూడా సమావేశంకానున్నారు.