బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారభోత్సవ కార్యక్రమానికి నేడు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ....ట్రాఫిక్ సమస్యతో బాలానగర్ ఏరియా లో దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నారని అన్నారు. నూతన ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. కూకట్పల్లి నియజకవర్గంలో వెయ్యి కోట్ల తో రోడ్లు, ఫ్లైఓవర్ లు ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. నగరంలో రవాణా వ్యవస్థ మరింత సులభ తరం చేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. బాలానగర్ ఫ్లైఓవర్ కు బాబు జగ్జివన్ రామ్ పేరు పెడుతున్నామని త్వరలో ఉత్తర్వులు ఇస్తామని కేటీఆర్ అన్నారు.