దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పెట్రోల్ ధర సెంచరీ దాటగా... గ్యాస్ ధర 800కు పైగా నే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల పెట్రోల్ ధరలు భారీగా పెరగడం పై పలువురు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ హుస్సేన్ సాగర్ లో బైక్ ను నిమర్జనం చేశారు. మరోవైపు వామపక్షాలు గ్యాస్ ధరలు భారీగా పెరగడాన్ని నిరసిస్తూ గ్యాస్ సిలిండర్ నిమజ్జనం చేశాయి. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. ప్రభుత్వాలు మరియు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి నిరసనలు చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని అన్నారు.