ఎక్కడ భూమి ఖాళీగా కనిపించినా దానిపై ముందుగా రాజకీయ నాయకుల కనపడటం సాధారణమే. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు వందల ఎకరాలు కబ్జాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా తాడిపత్రి లో ఓ వైసీపీ నాయకుడు 10కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అది పెన్నా భూమిగా సమాచారం. 15 ఎకరాల భూమిలో ఉన్న ముల్ల పొదలను కబ్జా చేసేందుకు తొలగించినట్టు కూడా తెలుస్తోంది. కర్నూలు జిల్లా నుండి వలస వచ్చి తాడిపత్రిలో భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.