సీఎం జగన్ కరోనా పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.... అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా రాత్రి తొమ్మిది గంటలకు రాష్ట్రంలో షాపులు అన్నింటినీ మూసివేయాలని ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా మాస్కులు ధరించనట్లయితే వారికి రూ.100 ఫైన్ వేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని కూడా సీఎం ఆదేశించారు.