మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు ఈరోజు కారెక్కారు. ఈ సంధర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ...జవహర్ నగర్ డంపింప్ యార్డ్ కు నిధులు కేటాయించే బాధ్యత తనదేనని అన్నారు. వెస్ట్ టు లెగసీ డంప్ ను ఏర్పాటు చేసామని చెప్పారు. 250 కోట్ల నిధులతో చెత్త దుర్వినియోగం కాకుండా ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నియోజకవర్గ పరిధిలో పేదలకు ఉచిత పట్టాలు ఇచ్చేలా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.