సాలార్జంగ్ మ్యూజియంలో ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్న ఓల్డ్ సిటీ బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వహకులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఉత్సవాల కోసం మొత్తం 90 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఏర్పాట్ల కోసం 75 కోట్లు, వివిధ ఆలయాలకు 15 కోట్ల ఆర్ధిక సహాయం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆలయాలకు ఆర్ధిక సహాయం పంపిణీ అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారని తలసాని చెప్పారు.