రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో కాలేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. కాలేశ్వరం నీటితో మిడ్ మానేరు ప్రాజెక్టు ను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కురిసిన వర్షాలతో మానేరు నిండుకుండలా మారింది. కాగా తాజాగా మిడ్ మానేరు బ్యాక్ వాటర్ కు సంబంధించిన వీడియోను ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మిడ్మానేరు కాలేశ్వరం ప్రాజెక్టు వాటర్ జంక్షన్ గా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ టూరిజం శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.