హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయంలో సునీతా బోయా అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సునీతా బోయా గత కొద్దిరోజులుగా సినిమాల్లో అవకాశాల పేరిట నిర్మాత బన్నీ వాస్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాలో బన్నీ వాస్ పై ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ బన్నీ వాస్ పై నాలుగు సారు జూబ్లీహిల్స్ పోలీలకు సునిత ఫిర్యాదు చేసింది. అయితే సునిత మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు ఆమెను ఇప్పటికే రెండు సార్లు అరెస్ట్ చేశారు.