తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. భారీ వర్షాలతో లోతట్టు ఈ ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ గత రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దాంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో రానున్న ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.