రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు వంటి డెల్టా ప్రాంతంలో రెండవ పంటకు సాగు నీరు ఉండి కూడా పంట వేయలేదంటే సిగ్గుచేటు అని అన్నారు. అధికారుల పొరపాట్లు, నిర్లక్యం, అసమర్ధత కారణంగానే కావలి రైతులు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం ఆఫీసులో, కలెక్టర్ కి తెలియజేశానని చెప్పారు. జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉండి కూడా ఇలా ఎందుకు జరుగుతుందోనని వ్యాఖ్యానించారు.