ధర్నాలకు నిలయమైన హైదరాబాద్ ఇందిరాపార్క్ ప్రాంతం వద్ద హైటెన్షన్ నెలకొంది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ ఇవాళ ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.