తెలుగుదేశం పార్టీకి మరియు తన అధ్యక్షపదవికి ఎల్ రమణ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ రోజు ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిర్స్ అయ్యింది. సీఎం కేసీఆర్ సమక్షంలోనే రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోబతున్నారు. ఈ సంధర్బంగా రమణ అభిమానులు మరియు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రమణ కేటీఆర్ సమక్షంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు.