ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలు తెరుచుకున్నాయి. అన్ని దేవాలయాల్లో చాలా కాలం తర్వాత భక్తులకు దర్శనం లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ అయ్యప్ప దేవస్థానంలో కి కూడా భక్తులను అనుమతిస్తున్నారు. అయితే తాజాగా ఆలయ కమిటీ కీలక ప్రకటన చేసింది. రోజుకు 5000 మంది భక్తులు మాత్రమే శబరిమలకు రావాలని కోరింది. దానికోసం ముందుగానే ఆన్లైన్లో లో పేరు నమోదు చేసుకోవాలని స్పష్టంచేసింది.