చీరాలలో అంగన్వాడి పాల ప్యాకెట్స్ బ్లాక్ మార్కెట్ దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. పిల్లలకు పౌష్టికాహారం క్రింద ప్రభుత్వం అందించే పాలప్యాకెట్స్ ను అంగన్ వాడీ కేంద్రాల నుండి సేకరించి వాటిని ఓ అంగన్వాడి టీచర్ భర్త గంగాధర్ షాపులకు విక్రయిస్తున్నారు. దాంతో షాపులపై సంయుక్తంగా దాడులు నిర్వహించిన రెవిన్యూ, పోలీస్, అంగన్వాడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. షాపుల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న 500 పాల ప్యాకెట్స్ గంగాదర్ నుండి స్వాధీనం చేసుకున్నారు.