ఏపీలో తెలుగుదేశం పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. టిడిపిలో తగిన గుర్తింపు లేదని శోభా హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శోభా హైమావతి గతంలో ఎస్ కోట ఎమ్మెల్యే గా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు గా కూడా పనిచేశారు.