హిమాయత్ సాగర్ లోకి 1666 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇలాగే వరద కొనసాగితే గేట్లు ఎత్తాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు సిద్ధం అవుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తితే మూసిలోకి భారీగా నీరు వస్తుంది. అందుకే మూసీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.