కోకాపేట భూముల సందర్శన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే రేవంత్ ఇంటి వద్ద మకాం వేసిన పోలీసులు.. రేవంత్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.