ఈరోజు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ఈటల తన పాదయాత్రను షురూ చేస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 23 రోజులపాటు ఈటల పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలో ఉన్న 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం వరకు ఈటల పాదయాత్ర చేయనున్నారు.