ఈ రోజు నుండి జేఈఈ మెయిన్స్ థర్డ్ ఫేజ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 20, 22, 25, మరియు 27 వ తేదీ వరకు ఈ మూడోవిడత పరీక్షలు జరగనున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి రోజూ రెండు బ్యాచ్ లుగా పరీక్షలు పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి బ్యాచ్ కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తరవాత మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో బ్యాచ్ కు పరీక్ష నిర్వహిస్తున్నారు.