రైతుల ఆదాయం రెట్టింపు కోసం ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారని పార్లమెంటు లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. 2022 లో రైతుల ఆదాయం రెట్టింపు చేసే అంశం పై ప్రధాని మోడీ కూడా ముందుకు రావడం హర్షణీయమని ఎంపీ వ్యాఖ్యానించారు. వ్యవసాయేతర రంగాలు..చిన్న వ్యాపారులకు , మత్స్య కారులకు, దుకాణాదారులకు, కూడా ముద్ర పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే వారికి వ్యవసాయేతర రంగాలలో కూడా ప్రోత్సహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాలో రైతులకు,కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులకు నెలవారి లక్ష్యాలు నిర్దేశించాన్నారు.