ఎల్ఆర్ఎస్ పథకం పై టీఆర్ఎస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పదిహేను రోజుల్లోనే సమస్యలు పరిష్కారం అంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా ఇప్పుడు దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టడం కుదరదని తేల్చి చెప్పేసింది. న్యాయస్థానం ఆదేశాలు వచ్చిన తరవాతే న్యాయస్థానం ఆదేశాల అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.