ఓ వైపు భారీ వర్షాలు మరో వైపు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యం లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా లో ట్వీట్ చేసారు. అంతేకాకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు సహాయక కార్యక్రమాలు చేపట్టాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.