గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దాంతో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాల గేట్లను ఎత్తడంతో మూసీ నదికి బారీగా వరదనీరు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని చాదర్ ఘాట్ , శంకర్ నగర్, మూసారాంబాగ్ కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక జీహెచ్ ఎంసీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇంకా ఇళ్లలోనే మూసి పరివాహ కాలనీల ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది.