తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని అప్పుడే తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు కనిపించలేదని... అందుకే అక్కడ కరువుకాటకాలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించాడు. తెలంగాణలో సీఎం కేసీఆర్ భవిష్యత్తును దృష్టితో ఉంచుకుని హరితహారం లాంటి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. కెసిఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.