ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిడ్ టీకా డోసులను కేంద్రం సరఫరా చేసింది. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఈ కొవిషీల్డ్ టీకా డోసులను చేరవేశారు. ఢిల్లీ నుండి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 31 బాక్సుల్లో ఈ టీకా డోసులను చేరవేశారు. మొదట గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు ఈ వ్యాక్సిన్ డోసులను తరలించారు.