సెప్టెంబర్ నుండి దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ లు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు సంస్థలలో ట్రయల్స్ కొనసాగుతున్నాయని రణదీప్ గులేరియా అన్నారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్ లతోనే ప్రమాదం ఉండటంతో పెద్దవాళ్లకు బూస్టర్ డోస్ అవసరమని అభిప్రాయపడ్డారు. మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గితే వేరియంట్ లు ప్రమాదకరంగా మారుతాయని స్పష్టం చేశారు.