గ్యాస్ సిలిండర్ పేలుడు 9 మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గుజరాత్లోని అహ్మదాబాద్ శివారులో ఈ పెను విషాద ఘటన జరిగింది. చిన్న గదిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇందులో మరింత విషాదం ఏంటంటే.. చనిపోయిన వారిలో నలుగురు పసి పిల్లలు కూడా ఉన్నారు.