అతి భారీ వర్షాల ధాటికి మహారాష్ట్రలోని కొంకణ్, పశ్చిమ ప్రాంతాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ప్రత్యేకించి రత్నగిరి జిల్లాను వరదలు ముంచెత్తాయి. రాయ్గడ్, సతారా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మొత్తం ఘటనల్లో మొత్తం 136 మంది వరకూ మరణించినట్టు తెలుస్తోంది.