టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ తెలుగు తేజం గ్రూప్ జే తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ముందడుగు వేసింది. ఈ మ్యాచ్‌లో ఈ స్టార్ షట్లర్ పీవీ సింధు ఇజ్రాయెల్‌కు చెందిన పోలికర్పోవా పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 21-7, 21-10 తేడాతో ఇజ్రాయెల్ క్రీడాకారిణిని పీవీ సింధు మట్టి కరిపించింది. ఆట ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది పీవీ సింధు.