తాజాగా పోర్నో గ్రఫీ కేసులో మరో 3,4 నలుగురు ప్రొడ్యూసర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఇప్పుడు మరో హీరోయిన్ పేరు కూడా చేరింది. నటి గెహ్నా వశిష్ట పేరు కూడా ఈ కేసులో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ బూతు చిత్రాల కేసులో ఈమె పాత్ర ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.