సీఎం కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగర్ లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్బంగా కేసీఆర్ హాలియా సభలో మాట్లాడుతూ..నాగార్జున సాగర్ లో వెనకబాటుతనం ఉందన్నారు. కరోనా నన్ను కూడా వదల్లేదని అందుకే సాగర్ కు రావడం ఆలస్యం అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సాగర్ ను అభివృద్ధి చేసేందుకే వచ్చానని చెప్పారు. ఇచ్చిన హామీలను తాము నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. హాలియాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశామని సిబ్బందిని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్ఆపరు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజక్టులు కడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఆ ప్రాజక్టుల వల్ల మనకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. నాగార్జున సాగర్ కు మంత్రి వచ్చి సమస్యలు తెలుసుకుంటారని. ఎంపీటీసీలు, జట్పీటీసీలు,ఎమ్మెల్యేలు అందరూ వచ్చి తమ ప్రాంత సమస్యలు చెప్పాలని అన్నారు. ఇండియాలో లేని కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు.