తాజాగా హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో కూడా హెల్మెట్ మనిషి ప్రాణాలను కాపాదుతుంది అని రుజువు చేసింది. ఓ యువతి స్కూటీ తో రోడ్డుపై వెళ్తుండగా ముందు వెళ్తున్న కారు సడన్ గా టర్న్ అవుతుంది. దాంతో యువతి ఆ కార్ ను ఢీకొట్టి ఎగిరి కింద పడింది. ఆ సమయంలో యువతి తలకు హెల్మెట్ ఉండడం వల్ల ఎలాంటి గాయాలు అవ్వలేదు. లేదంటే తలకు తీవ్ర గాయం అయ్యేది. ఈ వీడియోను షేర్ చేసిన హైదరాబాద్ పోలీసులు దీనికి ఏదైనా క్యాప్షన్ ఇవ్వమని కోరుతున్నారు.