టాలీవుడ్ లో విలన్ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చలపతిరావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి చలపతి రావు మెప్పించారు. అంతేకాకుండా చిరంజీవి, బాలయ్య హీరోలుగా నటించిన సినిమాల్లో పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చలపతిరావు నటుడిగా ఎదిగేందుకు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని చలపతిరావు చెప్పారు. సినిమాల్లోకి వచ్చేందుకు తన భార్యతో కలిసి తాను హైదరాబాద్ వచ్చానని అన్నారు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.