ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లు సత్తా చాటిన రెండో ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్ భారత జట్టును ఆదుకుంది. బౌలర్ల సమిష్టి కృషితో క్రికెట్ మక్కా లార్డ్స్‌లో భారత్ చివరి రోజు మరో తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.