భారత జట్టు విజయంలో హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్లో 94 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన సిరాజ్ అందరికంటే ఎక్కువగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని రెండు చేతులు అందిపుచ్చుకున్న యువ బౌలర్ రెండో ఇన్నింగ్స్ లో కూడా చెలరేగిపోయాడు.