కరోనా పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది. అత్యంత ప్రభావంతమైన కరోనా డెల్టా వేరియంట్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల అనేది వ్యాక్సిన్ యెక్క ఆవశ్యకతను పెంచిందని తెలిపింది. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపింది. దాంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడుతుందని మందుల కొరత ఏర్పడుతుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. ప్రపంచంలో చాలా దేశాలలో కరోనా పరీక్షల ధరలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో కరోనా టెస్టుల ధర తక్కువగా ఉందని తెలిపింది. హాస్పిటల్లలో మందులను ఇతర సామాగ్రిని పెంచేందుకు ప్రపంచం మొత్తం చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే మనదేశంలో డెల్టా వేరియంట్ ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగించిందో తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే ప్రభుత్వాలు మేల్కోవలసిన అవసరం ఎంతైనా ఉంది.