కారులో డెడ్ బాడీ ఘటనలో మరిన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. హత్యకు సూత్రధారిగా నగరానికి చెందిన వ్యాపారి కోరాడ విజయ్ కుమార్ ను అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతే కాకుండా ఈ హత్యతో మరో ముగ్గురు లేదా నలుగురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా హత్య కేసులో ఇద్దరు మహిళలు ఉన్నట్టు కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. విజయ్ కుమార్ భార్య పద్మజ తో పాటు మరో మహిళ గాయత్రి కూడా పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రాహుల్ ను వ్యాపారం లో లావాదేవీల మధ్య తలెత్తిన వివాదాల వల్లే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. కరణం రాహుల్ కు చెందిన వ్యాపారం లో గతం లో కోరాడ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆర్ధిక ఇబ్బందులతో తమ వాటా డబ్బులు కావాలంటూ కోరాడ ఒత్తిళ్లు తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తి హత్యకు దారితీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు.