ప్రకాశం జిల్లాలో ఓ తల్లి తన కూతురికి న్యాయం చేయాలని సీఐ కాళ్లు పట్టుకుని బతిమాలింది. ఈ ఫోటో కూతురుపై తల్లి ప్రేమను చాటేలా హృదయం దరుక్కుపోయేలా ఉంది. కొమరోలు మండలం రెడ్డి చర్ల గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ కూతురును బ్రాహ్మణపల్లికి చెందిన కాషయ్య అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి నిరాకరించాడు. నింధితులు పెళ్లి చేసుకుంటానని చెప్పి కట్న కానులు మాట్లాడుకుని రూ.5లక్షలు కూడా తీసుకున్నాడని మరియమ్మ చెబుతోంది. ఆ సమయంలో పెళ్లికి ఒప్పుకున్నాడని కానీ ఆ తరవాత పెళ్లికి నిరాకరిస్తున్నాడని మహిళా సంఘాలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగించి. అదే సమయంలో స్టేషన్ నుండి బయటకు వస్తున్న సీఐ ఫిరోజ్ కాళ్లను పట్టుకుని తన కూతురికి న్యాయం చేయాలని వేడుకుంది. దాంతో సీఐ యువతికి తగిన న్యాయం చేస్తానని మరియమ్మకు హామీ ఇచ్చారు.