టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన కొడుకు కోరిక మేరకు తన పిల్లల ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ తన భార్య పోనీ వర్మనే మరోసారి పిల్లల కోరిక మేరకు నిన్న పెళ్లి చేసుకున్నారు. ఈ సంధర్బంగా ప్రకాష్ రాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. అయితే ఈ సంధర్భంగా ప్రకాష్ రాజ్ ఆయన భార్య కలిసి దిగిన ఓ ఫోటోపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఫోటోలో ప్రాకాష్ రాజ్ ఆయన భార్యకు కుమారుడి ముందే ముద్దు ఇస్తున్నారు. దాంతో ప్రకాష్ రాజ్ కుమారుడు వారినే చూస్తున్నాడు. కాగా పిల్లల ముందు ఇలాంటి పనులేంటని కొంత మంది నెటిజన్లు ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లవాడు చూస్తుండగా తల్లి దండ్రులు ముద్దు పెట్టుకోవడం అస్సలు మంచిది కాదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. కానీ ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ చాలా ఓపెన్ మైండెడ్ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ కు ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు.