టాలీవుడ్ లో హీరోకి స్నేహితుడు ఇతర పాత్రలలో నటించి అలరించిన అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా నూటొక్క జిల్లాల అందగాడు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ బట్టతల వచ్చే కష్టాలను చూపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. బట్టతల వల్ల వచ్చే ఇబ్బందులు...అలాగే వారికి ఎదురయ్యే సమస్యలను ట్రైలర్ ఎమోషన్ మరియు కామెడీ రంగరించి చూపించారు. అంతేకాకుండా తండ్రి నుండి బట్టతల వచ్చిందనే కోపంతో అవసరాల శ్రీనివాస్ ఎమోషనల్ గా చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. హీరోకి బట్టతల ఉండటం హీరోయిన్ కు జుట్టు అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల వచ్చే సమస్యలను కూడా ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో అవసరాలకు జోడీగా రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.