ఆఫ్గనిస్తాన్ నుండి భారత్ వచ్చే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ వచ్చే వారందరికీ ఈ వీసా తప్పనిసరని కేంద్ర హోంశాఖ బుధవారం స్పష్టం చేసింది. గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మనదేశంలోని ఆఫ్ఘన్ ల వీసాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆఫ్ఘన్ల వీసాలు గల్లంతయ్యాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియాకు రావాలనుకునే వారికోసం వీసా దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను కూడా ప్రభుత్వం సూచించింది. http://www.indianvisaonline.gov.in అనే వెబ్సైట్ లో ఆఫ్ఘన్ భారతీయులు తమ ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దేశానికి రావాలనుకుంటున్న ఆఫ్గన్ జాతీయుల కోసం దరఖాస్తును వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఈ వీసాలు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.