వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇక పై రీ రిజస్ట్రేషన్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా వాహనం నడపడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఉన్న రీ రిజిస్ట్రేషన్ నిబంధనలను తొలగించింది. దాని స్థానంలో భారత్ రిజిస్ట్రేషన్ బిహెచ్ సిరీస్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా సొంత రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రానికి వెళ్తే మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవరసరం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో వాహనంను రిజిస్ట్రేషన్ చేసుకుంటే వేరే రాష్ట్రానికి వెలితే 12 నెలలు మాత్రమే నడుపుకోవచ్చు. ఆ తరవాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. అయితే కొత్తగా కేంద్రం తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్ విధానంలో కాస్త డబ్బులు ఎక్కువ ఖర్ఛు అవుతాయి కానీ మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.