టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీలో పరిస్థితిపై ఇటీవల తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కాలం నుండి పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఆయన పార్టటీలో సీనియర్లను పట్టించుకోవడం లేదనే కారణంగా పార్టీకి దూరమవుతున్నట్టు సంచలన వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..సీనియర్ నేతగా టీడీపీలో ముఖ్యనాయకులుగా ఉన్న బుచ్చయ్య చౌదరి పార్టీకి దాంతో పార్టీలోని ముఖ్యనేతల సంప్రదింపులతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ అధిష్టానం వద్దకు వచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధినేత చంద్రబాబు తో భేటీ అయ్యారు. గోరంట్లతో పాటు చంద్రబాబు తో చినరాజప్ప,గద్దె రామ్మోహన్, నల్లమల్లి రామకృష్ణ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం బుచ్చయ్య చౌదరి ఎలాంటి నిర్నయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.