కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా అమిత్ షా తెలంగాణలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా భారీ బహిరంగ సభను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో రజాకార్లను ఎదిరించి వేయి మంది దాకా వీరమరణం పొందారు..ఈ నేపథ్యంలోనే అమిత్ షా అక్కడ సభను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఖానా పూర్ మరియు చుట్టు పక్కల ప్రాంతాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుంది. దాంతో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రభావం కూడా చూపే అవకాశాలున్నాయి. బండి పాదయాత్ర...కిషన్ రెడ్డి యాత్ర ఇప్పుడు అమిత్ షా పర్యటనతో రాష్ట్రంలో బీజేపీ ఊపుమీద ఉంది.