బిగ్ బాస్ సీజన్-5 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. హౌస్ లో టన్నుల కొద్దీ కిక్ వస్తుందంటూ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక హౌస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా సీరియల్ నటి సిరి సుందర్ ఎంట్రీ ఇచ్చింది. బూం బద్దల్ అనే అనే ఐటెం సాంగ్ కు స్టెప్పులేస్తూ సిరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సిరి తన ఎంట్రీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున తో సరదాగా కాసేపు మాట్లాడి కుడి కాలు పెట్టి సిరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గోల్డెన్ కలర్ డ్రెస్ లో సిరి ఎంట్రీ బిగ్ బాస్ సీజన్ 5 కి హైలెట్ గా నిలిచింది. ఇక హౌస్ లో అంతా పరిశీలిస్తూ సిరి ఎంతో ఎక్సైట్ అయ్యింది. తనకు వంట రాదని...మ్యాగీ ఒక్కటే వచ్చని సిరి చెబుతూ వచ్చింది. ఇక ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతా అని మాటిచ్చా అని నాగ్ చెప్పగా... ఆ మాట నిలబెట్టుకుంటూ అని సిరి నాగార్జునకు మాటిచ్చించింది. మరి ఇంట్లో సిరి సుందర్ ఏ మేరకు వినోదాన్ని పంచుతుందో చూడాలి