బిగ్ బాస్ సీజన్ 5 లో ఐదవ కంటెస్టెంట్ గా అనీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. తాను సిక్రింద్రాబాద్ మిలిట్రీ హాస్పిటల్ లోనే పుట్టానని అనీ మాస్టర్ చెప్పారు. తర కుటుంబం అంతా ఆర్మీ, నేవీలో ఉందని కానీ తాను డ్యాన్స్ లోకి వచ్చానని తెలిపారు. ఇక తను డ్యాన్స్ కోసం పడ్డ కష్టాలను అనీ మాస్టర్ ప్రేక్షకులతో పంచుకున్నారు. తెలుసా.... తెలుసా అనే పాటకు అనీ మాస్టర్ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. తాను దూరం షూటింగ్ లకు వెళ్లినప్పుడు తన కొడుకును ఎంతో మిస్ అవుతాని బాధపడండ్డారు. ప్రతి సీజన్ లో మగవాళ్లు గెలిచారని..కానీ ఈ సీజన్ లో మహిళ విన్ అవ్వాలని తాను ఈ సారి టైటిల్ గెలిచి తీరతానని అనీ మాస్టర్ తెలిపింది. తాను తన లాగే ఉంటానని...తను ఎలా ఉంటానో ఇప్పటికే ప్రజలకు తెలుసునని అనీ మాస్టర్ అన్నారు. ఇక అనీ మాస్టర్ తన భర్తతో పాటు తన కొడుకుతో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సంధర్భంగా అనీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఎంట్రీలోనే బిగ్ బాస్ హౌస్ కు ఎమోషనల్ టచ్ ఇచ్చిన అనీ ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి.